Header Banner

సినిమాల పై ట్రంప్ బాంబు! 100 పర్సెంట్ టారిఫ్ - తెలుగు మూవీస్ పై ఈ ప్రభావం ఎంత?

  Mon May 05, 2025 14:54        U S A

USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం, విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో నిర్మించి, అమెరికాకు దిగుమతి చేసే అన్ని రకాల చలనచిత్రాలపై తక్షణమే 100 శాతం సుంకం (టారిఫ్) విధించాలని ఆదేశించినట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖ, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు సూచనలు జారీ చేసినట్లు తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు. అమెరికాలో సినిమా పరిశ్రమ వేగంగా దెబ్బతింటోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించి అమెరికన్ ఫిలిం మేకర్లను, స్టూడియోలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. "హాలీవుడ్‌తో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాలు దీనివల్ల దెబ్బతింటున్నాయి. ఇది ఇతర దేశాలు చేస్తున్న సమష్టి ప్రయత్నం, అందువల్ల ఇది జాతీయ భద్రతకు ముప్పు" అని ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ చిత్రాలు అమెరికా వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సంకేతాలను పంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. "మాకు అమెరికాలో తయారైన సినిమాలే కావాలి" అని ఆయన స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.! ఒక్క బుల్లెట్‌ వేస్ట్‌ కాకుండానే పాక్‌ను అల్లాడిస్తున్న ప్రధాని..

 

ట్రంప్ ఆదేశాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ స్పందిస్తూ, తాము ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు 'ఎక్స్'  లో తెలిపారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికాలో విడుదలయ్యే భారతీయ చిత్రాలపై, ముఖ్యంగా తెలుగు సినిమాలపై పెనుభారం మోపే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు గణనీయమైన మార్కెట్ ఉంది. పలు చిత్రాలు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుతూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. 2025లో కూడా కొన్ని తెలుగు చిత్రాలు యూఎస్‌లో భారీ విజయం సాధించాయి. తాజాగా 100శాతం సుంకం నిర్ణయంతో, అమెరికాలో తెలుగు సినిమాలను విడుదల చేసే పంపిణీదారులకు దిగుమతి ఖర్చు ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది. ఈ భారాన్ని వారు టికెట్ ధరల పెంపు రూపంలో ప్రేక్షకులపై మోపే అవకాశం ఉంది. దీనివల్ల టికెట్ ధరలు గణనీయంగా పెరిగి, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో పాటు, బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ఖర్చులు, తగ్గే లాభాల అంచనాలతో అమెరికాలోని తెలుగు చిత్రాల పంపిణీదారులు భవిష్యత్తులో సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్, అగ్ర తారల చిత్రాలకు మాత్రమే ఈ అదనపు భారాన్ని తట్టుకునే శక్తి ఉండొచ్చు. చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాల అమెరికా విడుదల ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ సుంకం విధింపు థియేటర్లలో విడుదల చేసే ప్రింట్లకేనా లేక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు కూడా వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే, ఈ నిబంధనల అమలు విదేశీ నిర్మాణ సంస్థలకా లేక విదేశాల్లో షూటింగ్ జరిపే అమెరికన్ సంస్థలకా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ పరిణామం తెలుగు చిత్రాల ఓవర్సీస్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Trump #Tariffs #IndiaModi #Modi #Trumpmeet